‘మా’లో మళ్లీ లొల్లి

తెలుగు మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌లో మళ్లీ లొల్లి బయట పడింది. నరేష్‌ అధ్యక్షుడిగా అవ్వకముందు రచ్చ ఏ స్థాయిలో జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శివాజీ రాజా మరియు ఇతర సభ్యుల మద్య దుమారం చాలా పెద్దది అయ్యింది. సినీ ప్రముఖులు ఎంటర్‌ అయ్యి వివాదంకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత కొత్త అధ్యక్షుడిగా నరేష్‌ ఎన్నిక అవ్వగా రాజశేఖర్‌ ఊపాధ్యక్షుడు అయ్యాడు. ఆయన భార్య జీవిత కూడా మాలో ఒక పదవిని దక్కించుకుంది.

మొదటి నుండి కూడా నరేష్‌ పద్దతి రాజశేఖర్‌కు నచ్చడం లేదు. ఆయన తీరును సున్నితంగా విమర్శిస్తూ వచ్చాడు. కాని తాజాగా కొందరు సభ్యులతో కలిసి నరేష్‌కు ఏకంగా షోకాజ్‌ నోటీసులు జారీ చేసే వరకు పరిస్థితి వెళ్లింది. వెంటనే నీవు నీ మా అధ్యక్ష పదవిని వదిలేయాల్సిందే అంటూ రాజశేఖర్‌ సదరు నోటీసులో పేర్కొన్నాడు. ఇంత వివాదంకు కారణం ఏంటీ అనే విషయంపై క్లారిటీ రాలేదు. ప్రస్తుతం లోలోపలే గొడవ జరుగుతోంది. ఈ గొడవ తీవ్ర రూపం దాల్చనుందా లేదంటే వెంటనే ఆగిపోతుందా అనేది చూడాలి.