తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరా అంటూ అంతా చర్చ జరుగుతోంది. ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేషన్ అయిన వారిలో శ్రీముఖి, హిమజ, పునర్నవి, మహేష్ మరియు శిల్పా చక్రవర్తి ఉన్నారు. ఈ అయిదుగురులో శ్రీముఖి ఖచ్చితంగా సేవ్ అవుతుంది. ఆమె సేవ్ అయిన తర్వాత హిమజ మరియు పునర్నవిలు సేవ్ అవుతారు. ఇక చివరకు మహేష్ విట్టా మరియు శిల్పా చక్రవర్తిలు ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే చర్చ జరుగుతున్న సమయంలో శిల్పకు తక్కువ ఓట్లు పడుతున్నాయి.
సీజన్ ఆరంభం నుండి కూడా మహేష్ విట్టా వరుసగా నామినేట్ అవుతూనే ఉన్నాడు. ఎలిమినేషన్‌కు నామినేషన్ అయిన ప్రతి సారి కూడా మహేష్ విట్టా సేవ్ అవుతున్నాడు. అందుకే ఈసారి కూడా తప్పకుండా సేవ్ అవుతాడనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతుంది. మహేష్ సేవ్ అయితే అనూహ్యంగా శిల్పా చక్రవర్తి ఎలిమినేట్ అవ్వక తప్పదు. శిల్పా మొదటి వారం ఎలిమినేషన్లో రాలేదు. ప్రస్తుతం రెండవ వారంలో ఆమె ఎలిమినేషన్లో ఉంది కనుక ప్రేక్షకులు ఆమెకు ఓట్లు వేయడం అనుమానమే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిగ్‌బాస్ ఏదైనా మాయ చేసి, ఓట్లను పట్టించుకోకుండా ఎలిమినేషన్ చేస్తే అప్పుడు శిల్ప ఉండే అవకాశం ఉంది.