తెలుగుతో పాటు పలు భాషల్లో హీరోయిన్గా నటించిన సంఘవి తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. టాలీవుడ్ ఆ నలుగురు స్టార్ హీరోలకు జోడీగా ఈమె నటించి మెప్పించింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఈ అమ్మడు అలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొంది. ఆ కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలను మీడియాతో షేర్ చేసుకుంది. ఈమె చేసిన సినిమాలు మరియు ఆమె వర్క్ చేసిన హీరోల గురించి మాట్లాడింది.
ఆ సమయంలో బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. నేను బాలయ్య గారితో రెండు సినిమాలు చేశాను. ఆయనతో షూటింగ్ అంటేనే కాస్త భయం వేసేంది. ఎందుకంటే ఆయన గురించి బయట చాలా విన్నాం. నేను ఆయనకు దూరంగా ఉంటూ, భయపడుతూ ఉండగా ఒక రోజు స్వయంగా ఆయనే నన్ను పిలిచి ఎందుకు భయపడుతున్నారు అంటూ ప్రశ్నించారు. మీకు కోపం ఎక్కువ అని విన్నాను. అందుకే మీకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను అనడంతో ఆయన నవ్వేసి, అలా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఫ్రీగా నాతో ఉండవచ్చు అన్నాడు. దాంతో తర్వాత రోజు నుండి ఆయనతో చాలా ఫ్రీగా ఉన్నాను.