తమిళ మరియు తెలుగు ఆడియన్స్ మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘భారతీయుడు 2’. దాదాపు రెండు పుష్కరాల క్రితం వచ్చిన భారతీయుడు చిత్రంకు ఇది సీక్వెల్. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా కాజల్ హీరోయిన్గా ప్రారంభం అయిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది. అసలు ఈ చిత్రం క్యాన్సిల్ అయ్యిందని, బడ్జెట్ కారణంగా పక్కకు పెట్టారని వార్తలు వచ్చాయి. కాని తాజాగా మళ్లీ షూటింగ్ ప్రారంభం అయ్యింది.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ను చెన్నైలోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్లో చిత్రీకరిస్తున్నట్లుగా అప్డేట్ వచ్చింది. దాదాపు రెండు వారాల పాటు అక్కడ కీలకమైన సీన్స్ మరియు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కొంత భాగం పూర్తి చేసిన శంకర్ వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో చాలా స్పీడ్‌గా షూటింగ్‌ను పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. కాజల్ కూడా త్వరలోనే సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. శంకర్ 2.ఓ చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం అవ్వడంతో దేశ వ్యాప్తంగా అంచనాలున్నాయి.