వరుణ్ ఎక్కడికో తీసుకెళ్లాడు కదా..

మెగా హీరో వరుణ్ తేజ్ తన లుక్ తో ఒక్కసారిగా అందర్నీ 1980 కాలం నాటికీ తీసుకెళ్లాడు. ప్రస్తుతం వరుణ్ హరీష్ శంకర్ డైరెక్షన్లో వాల్మీకి చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా..తమిళ్ హీరో అధర్వ మురళి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా ప్రొమోషన్లను పెంచారు. తాజాగా వరుణ్ ఓల్డ్ లుక్ ను విడుదల చేసి ఆకట్టుకున్నారు. 1980 స్టైల్ ల్లో బెల్ బాటమ్ ఫాంట్… షర్ట్.. కళ్ళకు పెద్దవైన కళ్ళద్దాలు అప్పటి ఫ్యాషన్ కు తగినట్టుగా హెయిర్ స్టైల్ తో భలే గా ఉన్నాడే అనిపించాడు. కొన్ని రోజుల క్రితం గుబురు గడ్డం.. ఉంగరాల జుట్టు నోట్లో సిగార్.. చేతిలో గన్నుతో భయపెట్టే విధంగా ఉన్న వరుణ్ తేజ్ గెటప్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్…ఇప్పుడు క్లాసికల్ గెటప్ ను విడుదల చేసి ఆకట్టుకున్నారు. ఇక ఈరోజు సాయంత్రం ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు.

ఇందులో వరుణ్ తేజ్ ఘని అలియాస్ గద్దలకొండ గణేష్ అనే పాత్రలో కనిపిస్తున్నాడు. 14 రీల్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.