టీం ఇండియా బౌలర్ షమీపై ఆయన భార్య హసీన్ జహాన్ గృహ హింస కేసును నమోదు చేసిన విషయం తెల్సిందే. పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో షమీపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. గతంలో ఆయనకు నోటీసులు ఇచ్చినా కూడా హాజరు కాని కారణంగా ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్దం అవుతున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో షమీ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.
అరెస్ట్ కాకుండా ఉండేందుకు షమీ బెయిల్ తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన చేస్తున్న ప్రయత్నాలు మాత్రం విఫలం అవుతూ ఉన్నాయి. ఇప్పటికే పలు సార్లు షమీ బెయిల్ పిటీషన్ వేయడం అవి క్యాన్సిల్ అవ్వడం జరిగింది. దాంతో షమీ అరెస్ట్ అవ్వక తప్పదేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోమవారం నాడు మరోసారి షమి బెయిల్ విషయమై విచారణ జరుగనుంది. అప్పుడైనా షమీకి బెయిల్ వచ్చేనో చూడాలి.