ఔరా.. సైరాకు ఆమె పారితోషికం అంతనా?

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో హీరోయిన్‌గా నయనతార నటించిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన సైరా చిత్రం విడుదలకు సిద్దం అవుతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఒక్కో విషయం రివీల్‌ అయ్యి సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రంలో నయనతార పారితోషికం గురించి ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ప్రస్తుతం హీరోలు తీసుకుంటున్న స్థాయిలో ఈమె పారితోషికం తీసుకుందని అంటున్నారు.

సైరా చిత్రం కోసం నయనతార కాస్త ఎక్కువ డేట్లే ఇవ్వాల్సి వచ్చింది. కనుక ఆమె పారితోషికం రెండు లేదా రెండున్నర కోట్ల వరకు ఉంటుందని అతా అనుకున్నారు. మహా అయితే మూడు వరకు ఉంటుందని భావించారు. కాని ఆమె ఈ చిత్రం కోసం చరణ్‌ నుండి పొందిన మొత్తం ఎంతో తెలుసా 6.3 కోట్లు. అవును అక్షరాల అంతే ఆమెకు చరణ్‌ పారితోషికంగా ఇచ్చాడు. ఈ చిత్రంలో ఆమెకే అత్యధిక పారితోషికం అంటున్నారు. చిరంజీవి సొంత సినిమా కనుక ఆయన పారితోషికం తీసుకోలేదు. దర్శకుడు కూడా ఆమె స్థాయిలో తీసుకోలేదని అంటున్నారు.