ఆ హీరోల పేర్లు చెప్తే ఇతర హీరోలు నన్ను వదిలేస్తారు

మలయాళి ముద్దుగుమ్మ ప్రియావారియర్‌ కనీసం ఒక్క సినిమా కూడా విడుదలకు కాకుండానే ఆల్‌ ఇండియా టాప్‌ సెలబ్రెటీ అయిపోయింది. ఆమె సోషల్‌ మీడియాలో చేసిన సందడి ఏ స్థాయిలో ఆమెకు క్రేజ్‌ను తెచ్చి పెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒరు అదార్‌ లవ్‌ చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించిన ప్రియా వారియర్‌ ఆ చిత్రంలో చేసిన కన్ను గీటే సీన్‌ మరియు ముద్దు గన్‌ సీన్స్‌తో ఓవర్‌ నైట్‌ స్టార్‌ అనడం కంటే ఓవర్‌ నైట్‌ సూపర్‌ స్టార్‌ అయ్యిందనుకోవచ్చు. గతంలో అంత స్పీడ్‌గా ఎవరికి అంత క్రేజ్‌ రాలేదు.

ఒరు ఆదార్‌ లవ్‌ ఆమెకు వచ్చిన క్రేజ్‌తో భారీగా మార్కెట్‌ అయితే చేసుకుంది. ప్రస్తుతం ఆమె కెరీర్‌ చాలా జోరుగా సాగుతోంది. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రియా వారియర్‌ తన అభిమాన హీరో పేరు చెప్పమంటే మాత్రం నో అంది. ఒకరు ఇద్దరు పేర్లు చెబితే ఇతర హీరోలు తమతో నటించే అవకాశంను తనకు ఇవ్వరు అని అందుకే తాను ఇకపై తన ఫేవరేట్‌ హీరోల పేర్లు చెప్పదల్చుకోవడం లేదు అంటూ కాస్త ముదురు సమాధానం ఇచ్చింది. ఆమె సమాధానంకు ఇంటర్వ్యూ చేసిన యాంకర్‌ బిత్తర పోయి ఉంటారు.