మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే చిత్రం విడుదల విషయంలో ఇప్పుడు అనుమానాలు మొదలు అయ్యాయి. ఎందుకంటే చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతున్నా కూడా ప్రమోషన్ కార్యక్రమాలు స్పీడ్ పెంచలేదు. దీనికి తోడు బాలీవుడ్ వార్ మూవీతో పోటీ వద్దనుకుని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ వార్తలు వస్తున్నప్పటికి పెద్దగా వాటిపై స్పందించేందుకు మేకర్స్ ముందుకు రాలేదు.
మౌనం అంగీకారంగా భావించవచ్చు. అంటే సైరా వాయిదా విషయంపై వారు దాదాపుగా ఒక కన్ఫర్మ్కు వచ్చినట్లుగా అనిపిస్తుంది. అందుకే సినిమా వాయిదా అంటూ వస్తున్న వార్తలను పుకార్లే అంటూ కొట్టి పారేయడం లేదు. దసరా సీజన్లో సైరా విడుదల చేయాలని భావిస్తున్నారు. అక్టోబర్ 2న కూడా దసరా సీజన్ అవుతుంది. దసరా సెలవులు ప్రారంభం అవుతాయి. కాని దసరా పండుగ వరకు కాస్త సమయం పడుతుంది. అందుకే వారం ఆలస్యంగా పండుగకు చాలా దగ్గర్లో ఈ చిత్రంను విడుదల చేస్తే రెండు విధాలుగా కలిసి వస్తుందని వారు భావిస్తున్నారు.