‘ఎన్టీఆర్‌’ విషయంలో అలా చేయకుండా ఉండాల్సింది : విష్ణు

తెలుగు వారి ఆత్మ గౌరవంను దేశ స్థాయిలో చాటిన నందమూరి తారక రామారావు అంటే పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి గౌరవిస్తారు. ఎంతో మంది ఆయన్ను అభిమానించడంతో పాటు ఆయన అంటే పడి చచ్చేంత ప్రేమను చూపిస్తూ ఉంటారు. అలాంటి ఎన్టీఆర్‌ బయోపిక్‌ అనగానే అంచనాలు పీక్స్‌లో వచ్చాయి. క్రిష్‌ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్నాడంటే ఇక నందమూరి అభిమానుల ఆనందకు హద్దులు లేకుండా పోయింది. కాని సినిమా ఫలితం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు పార్ట్‌లు కూడా డిజాస్టర్స్‌ కా బాప్‌ అన్నట్లుగా నిలిచాయి.

ఆ సినిమాను నిర్మించిన విష్ణు వర్ధన్‌ ప్రస్తుతం హిందీలో కపిల్‌ బయోపిన్‌ను, తమిళంలో జయలలిత బయోపిన్‌ను నిర్మిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు నిర్మాణంలో ఉన్న ఈ సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్‌ విషయంలో జరిగిన తప్పును గురించి స్పందించాడు. అసలు ఎన్టీఆర్‌ చిత్రంను రెండు పార్ట్‌లుగా తీసుకు రావడం అనేది పెద్ద తప్పుడు నిర్ణయంగా చెప్పుకొచ్చాడు. సినిమాలో ప్రేక్షకులు కోరుకున్న కీ పాయింట్స్‌ను చూపించలేము. ఎన్టీఆర్‌ చిత్రం నిర్మాతగా నాకు పెద్ద గుణపాఠం అన్నాడు.