కుమారితో పోరాడబోతున్న భీష్ముడు

యంగ్‌ హీరో నితిన్‌ ప్రస్తుతం చేస్తున్న చిత్రం ‘భీష్మ’. శ్రీనివాస కళ్యాణం చిత్రం తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న హీరో నితిన్‌ ఎట్టకేలకు ఈ చిత్రంను చేస్తున్నాడు. షూటింగ్‌ ఆలస్యంగా మొదలైనా కూడా సినిమాను మాత్రం ఇన్‌టైంలో తీసుకు వస్తామనే నమ్మకంతో దర్శకుడు వెంకీ కుడుముల ఉన్నాడు. భారీ ఎత్తున అంచనాలున్న భీష్మ చిత్రంను ఈ క్రిస్మస్‌కు అండే డిసెంబర్‌ చివర్లో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే సినిమాను పూర్తి చేసేందుకు యూనిట్‌ సభ్యులు అంతా ప్లాన్‌ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో విలన్‌ పాత్ర గురించి చర్చ జరుగుతోంది.

కుమార్‌ 21ఎఫ్‌ చిత్రంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ హెబ్బా పటేల్‌ ఈ చిత్రంలో విలన్‌ పాత్రను పోషించబోతుంది. అందుకోసం ఈ అమ్మడు చాలా వర్కౌట్‌ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. నితిన్‌తోని హెబ్బా హెడ్‌ టు హెడ్‌ అన్నట్లుగా కొన్ని సన్నివేశాలుంటాయని, విలనిజంతో ఈ అమ్మడు ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో అనే ఆసక్తి అందరిలో వ్యక్తం అవుతోంది. భీష్మ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తోంది. ఇదే సినిమాలో మరో బ్యూటీ హెబ్బా పటేల్‌ విలన్‌గా కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.