‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత దర్శకుడు శేకర్ కమ్ముల చాలా గ్యాప్ తీసుకున్నాడు. మామూలుగా అయితే సక్సెస్ వచ్చిన దర్శకుడు ఎవరైనా వెంటనే సినిమాను మొదలు పెడతారు. కాని శేఖర్ కమ్ముల మాత్రం చాలా కాలంగా ఏదో కారణం వల్ల ఖాళీగానే ఉన్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రాన్ని నాగచైతన్యతో చేసేందుకు సిద్దం అయ్యాడు. మొదట అంతా కొత్త వారితో ఒక చిత్రాన్ని చేయాలనుకున్నా కూడా ఏవో కారణాల వల్ల అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు నాగచైతన్యతో సిద్దం అయ్యాడు.
ఫిదా చిత్రంలో వరుణ్ తేజ్ మరియు సాయి పల్లవిలు నటించారు. ఇప్పుడు సాయి పల్లవిని తన సినిమాలోకి తీసుకుని నాగచైతన్యకు జోడీగా నటింపజేస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ చిత్రంను నేటి నుండి షూటింగ్కు తీసుకు వెళ్లారు. కేవలం మూడు నెలల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేసి డిసెంబర్ చివర్లో క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని శేఖర్ కమ్ముల భావిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ సునీల్ నిర్మిస్తున్నాడు. సాయి పల్లవి మరో సారి ఫిదా చేయడం ఖాయం అంటున్నారు.