పిక్‌టాక్‌ : టాప్‌ సింగర్‌ పిల్లలు ఎంత పెద్దయ్యారో చూడండి

టాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ సునీత భర్త నుండి చాలా కాలంగా విడిగా ఉంటున్న విషయం తెల్సిందే. ఆమె వైవాహిక జీవితం సరిగా లేని కారణంగా పిల్లలు చిన్నగా ఉన్న సమయంలోనే భర్తకు దూరం అయ్యింది. భర్తకు ఇప్పటి వరకు కూడా అధికారికంగా విడాకులు తీసుకోలేదని ప్రచారం. చిన్న పిల్లలతో భర్తకు దూరం అయిన సునీత కష్టపడి పిల్లలను చదివించి ఉన్నత విద్యావంతులను చేసింది. తాజాగా సునీత కొడుకు ఆకాష్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్నాడు.

గ్రాడ్యుయేషన్‌ పూర్తి అయిన సందర్బంగా జరిగిన కార్యక్రమంలో కూతురుతో కలిసి సునీత పాల్గొంది. ఈ సందర్బంగా తీసుకున్న ఫొటోను ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అందులో సునీత కంటే ఆకాష్‌ చాలా ఎత్తు అయ్యాడని తెలుస్తుంది. సునీత తన పిల్లల ఫొటోలను ఎక్కువగా సోషల్‌ మీడియాలో పెట్టలేదు. తాజాగా ఈ ఫొటో పెట్టడంతో వైరల్‌ అవుతోంది.