ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సాహో’ చిత్రం ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాక్ దారుణంగా వచ్చినా కూడా సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందడంతో పాటు హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీన్స్‌ను సినిమాలో పెట్టడంతో సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. కథ మరియు ఇతర విషయాలను పట్టించుకోకుండా కేవలం హై బడ్జెట్ వ్యాల్యూస్‌ను చూస్తున్నారు. ఒక ఫ్లాప్ మూవీ ఏకంగా 500 కోట్ల వరకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఇండియాలో ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి కనిపించలేదు.
మొదటి రోజే 130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సాహో చిత్రం రెండవ రోజు నుండి కూడా పర్వాలేదు అన్నట్లుగా మంచి వసూళ్లను రాబట్టింది. మొత్తం అయిదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయిన నేపథ్యంలో అన్ని చోట్ల కూడా మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. మొదటి వారాంతంకు 300 కోట్లను మించిన సినిమా అయిదు రోజుల్లో 350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మరో రెండు మూడు రోజుల్లో సినిమా 400 కోట్లను క్రాస్ చేయడంతో పాటు 500 కోట్లకు దగ్గర అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు దక్కించుకున్న టాప్ 10 చిత్రాల జాబితాలో ఈ చిత్రం నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.