రేపు అంటే బుదవారం నాడు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను పేల్చబోతున్నట్లుగా పోలీసులకు ఈమెయిల్ రావడంతో ఒక్కసారిగా అంతా హై అలర్ట్ అయ్యారు. గత కొన్నాళ్లుగా ఉగ్రవాదులు హైదరాబాద్‌ను టార్గెట్ చేశారు అంటూ ఐబీ నుండి సమాచారం వస్తున్న నేపథ్యంలో చాలా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అయినా కూడా ఈమెల్ బెదిరింపును చాలా సీరియస్‌గా తీసుకుని మరోసారి పదుల సంఖ్యలో సెక్యూరిటీ వారు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను జల్లెడ పట్టారు.
ఎయిర్ పోర్ట్‌కు బాంబు బెదిరింపు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. వెంటనే ఎంక్వౌరీకి ఆదేశించింది. ప్రత్యేక బృందాలను పంపించి ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీని పర్యవేక్షించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతంకు బాంబు ఏమీ లేదని తేల్చి చెప్పారు. పోలీసులు ఈమెల్ వచ్చిన ఐపీ ద్వారా ఈమెల్ పంపిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.