ఇండియన్ సినీ స్క్రీన్‌పై తనదైన ముద్ర వేసిన అతిలోక సుందరి మనను వదిలి వెళ్లి పోయి అప్పుడే సంవత్సరం అయ్యింది. ఆమె జ్ఞాపకాలు ఇంకా కళ్ల ముందు మెదులుతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక ఛానెల్లో ఆమె నటించిన సినిమాలు సందడి చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆమె మైనపు విగ్రహంను ఏర్పాటు చేసేందుకు టుస్సాడ్స్ మ్యూజియం వారు సిద్దం అయ్యారు. రేపు లండన్‌లో ఈ విగ్రహంను ఆవిష్కరించబోతున్న నేపథ్యంలో ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది.
ఆ వీడియోను పోస్ట్ చేసిన బోణీ కపూర్ కాస్త ఎమోషనల్ అయ్యి శ్రీదేవిపై తనకున్న ప్రేమను గుర్తు చేసుకున్నాడు. నీవు మా గుండెల్లో కలకాలం నిలిచి పోతావు. మేడం టుస్సాడ్స్ లో నీ విగ్రహం కోసం ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నాను అన్నాడు. ఇక ఆయన పోస్ట్ చేసిన వీడియోలోని మైనపు బొమ్మను చూస్తుంటే నిజంగా శ్రీదేవి బతికి వచ్చిందా అన్నట్లుగా ఉంది. వందకు వంద శాతం డీటైల్డ్‌గా తీసుకు రావడం వారికే సాధ్యం అయ్యింది. రేపు జాన్వీ కపూర్ ఈ విగ్రహంను ఆవిష్కరించబోతుంది.