‘వెంకీ మామ’ తర్వాత ఏంటీ?

వెంకటేష్‌ మొన్న సంక్రాంతికి ‘ఎఫ్‌ 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచానాల నడుమ ప్రస్తుతం ‘వెంకీమామ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మేనల్లుడు నాగచైతన్యతో కలిసి వెంకటేష్‌ నటిస్తున్నాడు. వీరిద్దరి కాంబో మూవీ కోసం ఫ్యాన్స్‌ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్న వెంకీ మామ త్వరలోనే విడుదల తేదీని ప్రకటించబోతున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

ఇక ‘వెంకీ మామ’ చిత్రం తర్వాత వెంకటేష్‌ నటించబోతున్న సినిమా ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొన్నటి వరకు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఈయన సినిమా ఉంటుందని అన్నారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వెంకటేష్‌తో సినిమా చేసేందుకు త్రివిక్రమ్‌ సిద్దంగా లేడట. అందువల్ల వెంకీ మరో దర్శకుడిని చూసుకోవాల్సిందే. పలు చిత్రాలు చర్చల దశలో అయితే ఉన్నాయి కాని ఒక్కటి కూడా ఫైనల్‌ కాలేదు. గతంలో ఒకేసారి రెండు మూడు సినిమాలు చేసిన వెంకీ ఇప్పుడు యంగ్‌ హీరోల మాదిరిగా ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నాడు. వెంకీ మామ తర్వాత తన తదుపరి చిత్రం ప్రకటించే అవకాశం ఉంది.