అజ్ఞాతవాసి, స్పైడర్‌లను బీట్‌ చేయలేక పోయిన సాహో

ప్రభాస్‌ హీరోగా 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘సాహో’ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంకు భారీ ఓపెనింగ్స్‌ వస్తాయని అంచనా వేశారు. అయితే సినిమాకు నెగటివ్‌ టాక్‌ వచ్చిన నేపథ్యంలో నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లేలా కనిపిస్తుంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ చిత్రం దుమ్ము దులుపుతుందని, హాలీవుడ్‌ రేంజ్‌లో సినిమా ఉంది కనుక ఇంగ్లీష్‌ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూస్తారని భావించారు.

అమెరికాలో ఈ చిత్రం దారుణమైన ఫలితాలన్ని నమోదు చేసింది. యూఎస్‌లో ప్రీమియర్‌ ద్వారానే మిలియన్‌ మార్క్‌ చేరుతుందని భావించారు. కాని కారణం ఏంటో కాని మిలియన్‌ మార్క్‌కు దూరంగానే ఉంది. యూఎస్‌లో ప్రీమియర్‌లతోనే మిలియన్‌ డాలర్లను సాధించిన చిత్రాల్లో ముందు బాహుబలి 2, అజ్ఞాతవాసి, బాహుబలి, ఖైదీ నెం.150, స్పైడర్‌ చిత్రాలు ఉన్నాయి. ఈ అయిదు సినిమాల తర్వాత 6వ సినిమాగా సాహో నిలిచింది. ఆ అయిదు సినిమాలు కూడా సాహో కంటే తక్కువ బడ్జెట్‌ సినిమాలే. అయినా సాహోకు ప్రీమియర్‌ షో కు పెద్దగా కలెక్షన్స్‌ రాలేదు.