భారత ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆర్ధిక వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్న విషయం తెల్సిందే. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి సంచలన నిర్ణయాలతో పాటు బ్యాంకుల విలీన పక్రియ చేస్తున్నాడు. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ అంటూ ఉన్న వివిధ బ్యాంక్‌లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రధాన బ్యాంకు అయిన ఆంధ్రా బ్యాంకును కూడా విలీనం చేసేందుకు సిద్దం అయ్యాడు.
తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏళ్లుగా ప్రముఖ బ్యాంక్‌గా సేవలు అందిస్తున్న ఆంధ్రా బ్యాంక్‌ను యూనియన్ బ్యాంకులో విలీనం చేయబోతున్నాడు. ఈ నిర్ణయంపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నోరు మెదపక పోవడంపై బ్యాంకు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రా బ్యాంక్‌ను అలాగే కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కాని మోడీ ఒకసారి నిర్ణయం తీసుకున్నాడు అంటే అది అమలు అయ్యి తీరాల్సిందే. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి కొన్ని రోజుల్లోనే ఆంధ్రా బ్యాంక్ కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ హైదరాబాద్ కనుమరుగయ్యింది.