చిరంజీవి వారం రోజుల క్రితం సైరా చిత్రం ప్రమోషన్ విషయంలో ముంబయి వెళ్లిన విషయం తెల్సిందే. ఆ సందర్బంగా పలు జాతీయ మీడియా సంస్థలతో ఇంటరాక్ట్ అయ్యాడు. రెండు రోజులు బిజీ బిజీగా గడిపిన చిరంజీవి ముంబయి నుండి హైదరాబాద్ వచ్చేందుకు విమానం ఎక్కాడు. చిరంజీవి ప్రయాణించిన విమానం ల్యాండ్ అయిన 15 నిమిషాలకు సాంకేతిక సమస్య తలెత్తడంతో వెంటనే పైలెట్ చాకచక్యంగా వెనక్కు తిప్పినట్లుగా తెలుస్తోంది.
టేకాఫ్ అయిన 25 నిమిషాల్లోనే మళ్లీ ముంబయి ఎయిర్ పోర్ట్ లోనే చిరంజీవి ప్రయాణించిన విమానం ల్యాండ్ అయ్యింది. ఈ విషయం కాస్త ఆలస్యంగా మీడియాకు తెలిసింది. అదే విమానంలో చరణ్ కూడా ప్రయాణించాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ముంబయిలో ఉండి పోయాడు. మేనేజర్‌తో కలిసి చిరంజీవి ఒంటరిగా విమానం ఎక్కాడు. ఆ సమయంలో విమానంలో 150 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది.