తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 మొదటి కెప్టెన్‌గా వరుణ్ సందేశ్ ఎంపిక అయిన విషయం తెల్సిందే. ఆ సమయంలో ఆయన కెప్టెన్‌గా తన కనీస విధులను నిర్వర్తించలేదు. పైగా తానే ఇంటి నియమాలను పాటించలేదు. ఆ కారణంగా ఆయనకు పనిష్మెంట్ కూడా విధించడం జరిగింది. ఇకపై వరుణ్‌కు కెప్టెన్ అయ్యే అవకాశం లేదు అంటూ బిగ్‌బాస్ అప్పుడు ప్రకటించాడు. అయితే అనూహ్యంగా నిన్నటి ఎపిసోడ్లో వరుణ్ సందేశ్. ఈ విషయంలో బిగ్‌బాస్ నిర్వాహకులు తప్పు చేశారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.
బురదలో బాల్స్‌ను కలెక్ట్ చేసే టాస్క్‌లో వరుణ్, బాబా భాస్కర్, రాహుల్‌లు పోటీ పడ్డారు. ఈ ముగ్గురిలో కూడా వరుణ్ ఎక్కువ బాల్స్‌ను కలెక్ట్ చేయడం వల్ల కెప్టెన్ అయ్యాడు. బిగ్‌బాస్ నిర్వాహకులు ఈ విషయాన్ని మర్చి పోయారా లేదంటే ప్రేక్షకులు ఏం పట్టించుకుంటారులే అనుకున్నారో కాని మళ్లీ వరుణ్ సందేశ్‌ను కెప్టెన్‌గా చేయడం జరిగింది. ఇప్పటికే వచ్చే వారంకు ఇమ్యూనిటీ లభించిన వరుణ్ సందేశ్‌కు కెప్టెన్ అవ్వడంతో మరిన్ని పవర్స్ దక్కుతాయి.