ప్రభాస్‌కు రాజమౌళి ఎంతటి ఆప్తుడో ప్రతి ఒక్కరికి తెల్సిందే. ప్రస్తుతం ప్రభాస్‌కు జాతీయ స్థాయిలో స్టార్డం ఉంది అంటే అది ఖచ్చితంగా రాజమౌళి వల్లే. ఇద్దరి మద్య ఆప్యాయత చాలా ఎక్కువగా ఉంటుంది. వీరిద్దరు ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్లోజ్‌గా డీప్‌గా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఒకరికి ఒకరు విషెష్ చెప్పుకోవడం, ప్రమోట్ చేసుకోవడం చేస్తారు. సాహో చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన రాజమౌళి ఏ స్థాయిలో సినిమాను ఎత్తేశాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాని సినిమా విడుదల తర్వాత మౌనంగా ఉన్నాడు.
సాహో చిత్రంకు నెగటివ్ టాక్ వచ్చింది. సినిమాపై ఏమాత్రం పాజిటివ్ వెబ్స్ లేవు. దాంతో రాజమౌళి సినిమా గురించి స్పందంచకుండా ఉండి పోయాడు. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్లో ఉన్న రాజమౌళి సినిమా చూడకున్నా సినిమాకు హిట్ టాక్ వచ్చి ఉంటే ఖచ్చితంగా స్పందించేవాడు. సోషల్ మీడియా ద్వారా రాజమౌళి సాహో గరించి తప్పకుండా ప్రమోట్ చేసేవాడు. కాని ఫ్లాప్ సినిమాను నెత్తిన ఎత్తుకోవడం ఎందుకని ప్రభాస్ స్నేహితుడు అయినా కూడా జక్కన్న ఆ సినిమాను గురించి ట్వీట్ చేయలేదు.