అన్ని భాషల సినిమా పరిశ్రమల్లో కూడా కాస్టింగ్ కౌచ్ అనేది ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాస్టింగ్ కౌచ్ కారణంగా ఎంతో మంది అమ్మాయిలు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. పక్కలోకి వస్తేనే కెమెరా ముందుకు వచ్చే ఛాన్స్ ఇస్తామంటూ చెప్పడంతో ఎంతో మంది గతంలో అలా ఇబ్బందులు ఎదుర్కొన్న వారు ఉన్నారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. మీటూ ఉద్యమం మొదలైన తర్వాత కాస్టింగ్ కౌచ్ తగ్గడం కాదు పూర్తిగా కనుమరుగయ్యిందని అంతా అనుకుంటున్నారు. కాని కాస్టింగ్ కౌచ్ ఇంకా ఉందని పాయల్ రాజ్‌పూత్ చెప్పుకొచ్చింది.
తాను ఆర్‌ఎక్స్ 100 చిత్రం చేసిన తర్వాత ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్న సమయంలో నా వద్దకు వచ్చిన కొందరు పెద్ద సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తామంటూ కమిట్‌మెంట్స్ అడిగారు. వారితోనే కాకుండా వారు చూపించిన వారితో కూడా అడ్జస్ట్ అవ్వాలన్నారు. వారి పేర్లు ప్రస్తుతానికి నేనేం చెప్పను. కాని వారు మాత్రం అత్యంత నీచంగా నాతో ప్రవర్తించారని పాయల్ చెప్పుకొచ్చింది. తాను కెరీర్ పరంగా చాలా బాగున్నానని, ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నట్లుగా పేర్కొంది. మీటూ ఉద్యమం ఇంతగా ఉన్నా కూడా కాస్టింగ్ కౌచ్ ఇంకా ఉండటం పట్ల పాయల్ ఆవేదన వ్యక్తం చేసింది.