బిగ్‌బాస్ సీజన్ 3 ఆరవ వారంలో అడుగు పెట్టింది. ఈ వారంలో ముగ్గురు మాత్రమే ఎలిమినేషన్స్‌లో ఉన్నారు. వారిలో పునర్నవి, హిమజ, మహేష్. ఈ ముగ్గురిలో మహేష్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ బయట టాక్ వినిపిస్తుంది. ఎలిమినేషన్ విషయం పక్కన పెడితే నిన్నటి ఎపిసోడ్లో ట్రైన్ టాస్క్‌లో ఇంటి సభ్యులు జీవించేస్తున్నారు. ముఖ్యంగా పునర్నవి మరియు రవిలు కొత్తగా పెళ్లి అయిన వారి మాదిరిగా ఒకటే రొమాన్స్ చేసుకుంటున్నారు.
కొత్తగా పెళ్లయిన అమ్మాయి మాదిరిగా అందమైన చీర కట్టుకుని పునర్నవి చక్కగా ఉంది. ఇక కొత్త పెళ్లి కొడుకు తరహాలో పదే పదే భార్య వద్దకు వెళ్లి ఏదో ఒకటి చిలిపి పని చేస్తూ, ముద్దులు పెట్టేస్తున్న వ్యక్తిగా రవి జీవించేస్తున్నాడంటే నమ్మండి. ఇద్దరు కూడా కొత్త జంటగా అబ్బో అదిరిపోయేలా రొమాన్స్ చేస్తున్నారు. అయితే రొమాన్స్ కాస్త అతి అయ్యిందని కొందరు విమర్శలు చేస్తున్నారు. నిజంగానే ముద్దులు పెట్టుకునే వరకు, ఇంకా అతి అవసరం లేదు అంటూ టాక్ వినిపిస్తుంది. మొత్తానికి రవి, పునర్నవిలు నిన్నటి ఎపిసోడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.