వాజ్‌పేయి, సుష్మ, జైట్లీ తర్వాత మోడీ?

కొన్ని నెలల గ్యాప్‌లో బీజేపీకి చెందిన ప్రముఖ నాయకులైన వాజ్‌పేయి, మనోహర్‌ పారికర్‌, సుష్మ స్వరాజ్‌, అరుణ్‌ జైట్లీలు మృతి చెందిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు చేతబడి చేయించారనే ఆరోపణలు అనుమానాలు వస్తున్నాయి. కొందరు ఈ విషయాన్ని జోక్‌గా కొట్టి పారేస్తుంటే మరి కొందరు మాత్రం సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఇటీవలే బీజేపీ ఎంపీ సాద్వీ ప్రతిపక్ష పార్టలపై ఈ విషయమై విరుచుకు పడింది. ఈ నేపథ్యంలోనే బ్రిటన్‌ ఎంపీ కూడా ఈ విషయమై స్పందించాడు.

బ్రిటన్‌ ఎంపీ నజీర్‌ అహ్మద్‌ సోషల్‌ మీడియాలో స్పందిస్తూ.. బీజేపీ నేతలపై ప్రతిపక్ష పార్టీల నాయకులు చేతబడి చేయిస్తున్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. వారి తర్వాత టార్గెట్‌ మోడీ అయ్యి ఉంటాడని ఆయన పోస్ట్‌ చేశాడు. నజీర్‌ అహ్మద్‌ ట్వీట్‌కు తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ట్వీట్‌కు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ఘాటుగా స్పందించారు. ఇలాంటి వారు చట్టసభల్లో ఎలా ఉంటున్నారో అంటూ ఎద్దేవ చేశాడు.