కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఇటీవలే తన మంత్రివర్గంను విస్తరించిన విషయం తెల్సిందే. 17 మందితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించిన యడ్యూరప్ప తాజాగా మంత్రి పదవి దక్కించుకున్న లక్ష్మణ్ సావడికి ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాడు. పలు సమీకరణాలు నేపథ్యంలో ముగ్గురికి డిప్యూటీ సీఎం పదవులను కట్టబెట్టిన యడ్యూరప్ప ఆ నేపథ్యంలోనే లక్ష్మణ్ సావడికి ఛాన్స్ ఇచ్చాడు. అయితే యడ్యూరప్ప చేసిన పనితో విమర్శలపాలవుతున్నాడు.
ఎందుకంటే తాజాగా ఉపముఖ్యమంత్రిగా నియమితం అయిన లక్ష్మణ్ సావడి గతంలో అసెంబ్లీలో సభా కార్యక్రమాలు జరుగుతున్న సందర్బంగా పోర్న్ వీడియోలు చూశాడు. ఆ విషయం జాతీయ మీడియాలో సైతం ప్రముఖంగా వచ్చింది. దాంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ఖతం అవుతుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఆయన మళ్లీ ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఏకంగా ఉపముఖ్యమంత్రిగా కూడా పదవి దక్కించుకున్నాడు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనేందుకు ఇదే నిదర్శనం. ముందుముందు కూడా ఇలాంటివి కామన్‌గా జరుగుతూనే ఉంటాయి. చూసి చూడనట్లుగా మనమే వదిలేయాల్సిందే.