తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ అదుగో ఇదుగో అంటూ గత ఆరు నెలలుగా జరుపుతూ వస్తున్నాడు. పార్లమెంటు ఎన్నికలు పూర్తి అయిన వెంటనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంతా అనుకున్నారు. కాని ఏవో కారణాలు చెబుతూ, ఆందోళనలో ఉన్న సీఎం కేసీఆర్ తన క్యాబినెట్‌ను విస్తరించడం లేదు అంటూ టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రి వర్గ విస్తరణకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
దసరా తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని, త్వరలోనే కొత్త మంత్రులకు సంబంధించిన పేర్లను కూడా ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణ కోసం పలువురు ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. హరీష్ రావుకు మంత్రి పదవి దక్కక పోవడంతో ఆయన వర్గం చాలా కోపంతో ఉంది. ఇలాంటి సమయంలో మంత్రి వర్గ విస్తరణ చేసి హరీష్ వర్గంను చల్లార్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తాడా లేదంటే మా వేడి మరింత రాజేస్తాడా అనేది చూడాలి. ఇక కేటీఆర్‌కు కూడా మంత్రి పదవి దక్కేనా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. కేటీఆర్‌ను పూర్తిగా పార్టీకే కేటాయించాలని కేసీఆర్ భావిస్తే అప్పుడు మంత్రి అయ్యే అవకాశం లేదు. మరి కేసీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. అక్టోబర్ రెండవ లేదా మూడవ వారంలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది.