రాజు ఏది అనుకుంటే అది జరిగి పోవాల్సిందే. అధికారంలో ఉన్నవారు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. అది ప్రస్తుతం అధికారంలో ఉన్న వారికి మాత్రమే కాకుండా గతంలో అధికారంలో ఉన్న వారికి కూడా చెల్లుబాటు అయ్యింది. సరిగ్గా 9 ఏళ్ల క్రితం గుజరాత్ హోం మంత్రిగా అమిత్ షా ఉన్న సమయంలో ఒక భూటకపు ఎన్కౌంటర్ కేసులో ఆయన్ను అప్పట్లో సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ సమయంలో కేంద్రంలో హోం మంత్రిగా చిదంబరం ఉన్నాడు. చిదంబరం కక్ష కట్టి మరీ తనను అరెస్ట్ చేశాడంటూ అమిత్ షా మనసులో పెట్టుకున్నాడు.
తాజాగా అమిత్ షా హోం మంత్రి అయ్యాడు. జాతీయ స్థాయిలో నెం. 2 అయ్యాడు. ప్రధానికి తాను ఏది చెప్తే అది, ఎంత చెప్తే అంతే. అందుకే ఇక చేసేది ఏముంది. తన పగను తీర్చుకునే సమయం వచ్చింది. ఏదో ఒక కేసులో కనీసం ఒక్క రోజైనా చిదంబరంను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనుకున్న అమిత్ షా అర్ధరాత్రి సమయంలో ఆయన్ను అరెస్ట్ చేయించాడు అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చిదంబరం కేసు విషయంలో జరుగుతున్న తీరు చూస్తుంటే అమిత్ షా కక్ష సాధింపు అనేది క్లీయర్‌గా కనిపిస్తుందని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు.