ఇటీవల హీరో రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదంకు గురైన విషయం తెల్సిందే. రాజ్ తరుణ్ డ్రైవ్ చేస్తున్న సమయంలో కారు అదుపు తప్పి గోడను ఢీ కొట్టింది. ఆ సమయంలో సీటు బెట్లు పెట్టుకుని ఉండటంతో పాటు, ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయిన కారణంగా రాజ్ తరుణ్ బతికి బట్టకట్టాడు. ఇంతటితో ఈ వివాదం అంతా ముగిసిందని అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా రాజ్ తరుణ్ పారిపోతున్నప్పుడు కార్తిక్ అనే వ్యక్తి తన ఫోన్‌తో వీడియో తీశాడు.
ఆ వీడియోలో రాజ్ తరుణ్ మాట్లాడుతూ ప్లీజ్ బ్రదర్ వదిలేయండి, కాస్త తాగి ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆ వీడియోను తాజాగా ఇచ్చేయాలంటూ రాజ్ తరుణ్‌కు చెందిన వారు కార్తీక్‌ను అడిగారు. అందుకోసం అయిదు లక్షల రూపాయలు కూడా ఇస్తామంటూ ఆఫర్ చేశారట. కాని కార్తీక్మాత్రం నో చెప్పాడు. దాంతో కార్తీక్ ను బెదిరించారట. రాజ్ తరుణ్‌కు మేనేజర్‌గా వ్యవహరిస్తున్న రాజా రవీంద్ర స్వయంగా కార్తీక్‌కు కాల్ చేసి మాట్లాడాడు. ప్రస్తుతం టీవీల్లో ఆ వీడియోలు, వాయిస్ కాల్స్ రచ్చ చేస్తున్నాయి.