ఈ ఇంట్లో ‘ప్రతి రోజు పండుగే’

దర్శకుడు మారుతి కాస్త గ్యాప్‌ తీసుకుని ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌తో ‘ప్రతిరోజు పండుగే’ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం కోసం సాయి ధరమ్‌ తేజ్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. చాలా కాలం తర్వాత చిత్రలహరితో ఒక మోస్తరు సక్సెస్‌ను దక్కించుకున్న సాయి ధరమ్‌ తేజ్‌ ఈ చిత్రంతో మరో హిట్‌ను దక్కించుకుని తన స్థానంను పదిలం చేసుకునేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

పల్లెటూరు నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఒక భారీ ఇంటి సెట్‌ను నిర్మించారు. ప్రస్తుతం ఆ ఇంట్లోనే చిత్రీకరణ జరుపుతున్నారు. మీరు పై చూస్తున్న ఇంటి సెట్‌లో చిత్రీకరణ జరుపుతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు తెలియజేశారు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంను ఈ ఏడాది చివర్లోనే విడుదల చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గీతా ఆర్ట్స్‌ మరియు యూవీ క్రియేషన్స్‌ వారు ఈ చిత్రంను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ స్పీడ్‌గా జరుగుతోంది.