రాజధానిని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి

ఏపీ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుండి తరలించే ప్రయత్నాలు చేస్తుందని, అందుకోసం వరదలు అడ్డు పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నట్లుగా అనిపిస్తుంది అంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. వరద నీటిని మెయింటెన్‌ చేయడం పెద్ద కష్టం ఏమీ కాదు. కాని ఏదో చేయాలని, జనాల్లో భయాందోళనల్లో ముంచెత్తాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి పనులు చేస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు ఆరోపించాడు. అమరావతి నుండి రాజధానిని మరెక్కడికైనా తీసుకు వెళ్లే ఉద్దేశ్యంలో జగన్‌ ప్రభుత్వం ఉందేమో అనే అనుమానంను చంద్రబాబు వ్యక్తం చేశాడు.

నేడు కృష్ణ పరివాహక ప్రాంతంలో ముంపుకు గురైన ప్రజలను కలుసుకున్న చంద్రబాబు నాయుడు వారిని ఓదార్చాడు. వారికి సాయం చేసేందుకు తెలుగు తమ్ములకు ఆదేశాలు ఇచ్చాడు. ఇదే సమయంలో జగన్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, తాము అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిలపాలని ప్రయత్నిస్తే జగన్‌ ప్రభుత్వం మాత్రం నీటిలో ముంచేసే ప్రయత్నం చేసిందని విమర్శలు చేయడం జరిగింది. ఈ విషయంపై ప్రజలు ఊరుకునే ఉంటే ముందు ముందు ప్రమాధ స్థాయిలో ఇలాంటి చర్యలకు ప్రభుత్వం సిద్దమయ్యే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు ఆరోపించాడు. మా ప్రభుత్వం హయాంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన ప్రాజెక్ట్‌లు అన్ని కూడా ఇప్పుడు ఆగిపోయాయంటూ ఆరోపించాడు.