సాహో చిత్రం కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షులు ఎదురు చూస్తుంటే ఏపీలో మాత్రం టీడీపీ నాయకులు ఈ చిత్రాన్ని తొక్కేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. సాహో చిత్రంపై అక్కస్సును టీడీపీ వారు వెళ్లగక్కుతున్నారు అంటూ విమర్శలు వస్తున్న సమయంలో సాహో చిత్రం గురించి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగానే తాము కూడా ఎదురు చూస్తున్నట్లుగా సాహో గురించి నారా లోకేష్ ట్వీట్ చేశాడు.
సోషల్ మీడియాలో ఇలాంటి పోస్ట్‌ను నారా లోకేష్ పెట్టడంతో అంతా కూడా సాహో గురించి మాట్లాడుకోవడం చేస్తున్నారు. కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా టీవీ ఛానల్స్‌లో కూడా ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. దాంతో సాహోకు ఫ్రీగా భారీ ఎత్తున పబ్లిసిటీ కూడా దక్కింది. సాహోకు కోట్లు ఖర్చు చేసిన పబ్లిసిటీ దీంతో వచ్చిందని అంటున్నారు. ఈ విషయమై నిర్మాతలు చాలా ఆనందంగా ఉన్నారు. నారా లోకేష్ చిన్న విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ట్వీట్ చేయడం వల్ల ఈ చిత్రం గురించి మీడియాలో ఫోకస్ పెరిగింది. తనకు తెలియకుండానే సాహో చిత్రంకు లోకేష్ చాలా పెద్ద సాయం చేశాడు.