బాలీవుడ్‌లో నటించేందుకు ఇబ్బంది పడుతున్నారా?

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తెలుగులో సూపర్‌ హిట్‌లతో స్టార్‌ హీరోగా వెలుగు వెలుగుతున్న సమయంలో జంజీర్‌ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే బాలీవుడ్‌లో అదొక చెత్త సినిమాగా నిలిచి పోయింది. ఎంత చెత్త సినిమా అంటే చెత్త సినిమాలకు అవార్డులు ఇచ్చే ఒక సంస్థ ఆ ఏడు మేటి చెత్త సినిమాగా కూడా నిర్ణయించారు. రామ్‌ చరణ్‌ అప్పటి నుండి కూడా బాలీవుడ్‌ మొహం ఎత్తి చూడలేదు. బాలీవుడ్‌లో ఈయన చేసిన సినిమా అదే మొదటిది అదే చివరిది అయ్యింది. తాజాగా బాలీవుడ్‌లో నటించడంపై చరణ్‌ స్పందించాడు.

చరణ్‌ నిర్మించిన సైరా చిత్రంను హిందీలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు అక్కడ టీజర్‌ రిలీజ్‌ కార్యక్రమం చేశారు. ఈ సందర్బంగా చరణ్‌ మీడియాతో ముచ్చటించారు. ఎందుకు మీరు బాలీవుడ్‌లో నటించడం లేదు, హిందీ సినిమాలో నటించేందుకు మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటూ ప్రశ్నించిన సమయంలో నాకు హిందీలో నటించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే హిందీలో మంచి కథతో నా వద్దకు ఎవరు కూడా రాలేదు. మంచి కథథో మంచి దర్శకుడు వస్తే తప్పకుండా మరోసారి హిందీలో నటిస్తానంటూ క్లారిటీ ఇచ్చాడు. మరి ఆ మంచి కథ చరణ్‌ వద్దకు అసలు వెళ్తుందో లేదో చూడాలి.