అల్లు అర్జున్‌ డబుల్‌ రోల్‌ నిజమేనా?

అల్లు అర్జున్‌ హీరోగా ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఆ చిత్రం గురించి పలు వార్తలు సోషల్‌ మీడియాను కుదిపేస్తూనే ఉన్నాయి. తాజాగా అల్లు అర్జున్‌ లుక్‌ కూడా రివీల్‌ అయ్యింది. ఒక మద్యతరగతి కుర్రాడి పాత్రలో అల్లు అర్జున్‌ కనిపించబోతున్నట్లుగా టైటిల్‌ లోగో ఆవిష్కరించిన సందర్బంగా క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ రెండు విభిన్నమైన పాత్రలను చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

అల్లు అర్జున్‌ మొదటి సారి డబుల్‌ రోల్‌ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఉండని విభిన్నమైన రీతిలో ఈ చిత్రంను త్రివిక్రమ్‌ తీస్తున్నాడని, అల్లు అర్జున్‌ కెరీర్‌లో బెస్ట్‌ సినిమా అవుతుందనే నమ్మకం అయితే వ్యక్తం అవుతుంది. సినిమా కలెక్షన్స్‌ విషయం పక్కన పెడితే బన్నీకి మంచి పేరు అయితే తెస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. అందరి అంచనాలను ఈ చిత్రం నిలుపుతుందా లేదా అనేది తెలియాలి అంటే వచ్చే సంక్రాంతి వరకు వేచి ఉండాల్సిందే.