BBS3 : 5వ వారం ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయిన వారు వీరే

తెలుగు బిగ్‌బాస్‌ నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. మొదటి నాలుగు వారాల్లో హేమ, జాఫర్‌, తమన్నా, రోహిణిలు ఎలిమినేట్‌ అయిన విషయం తెల్సిందే. ఇక అయిదవ వారం ఎలిమినేషన్‌కు నామినేషన్స్‌ జరిగాయి. ఎలిమినేషన్‌ నామినేషన్‌ పక్రియ నిన్నటి ఎపిసోడ్‌లో విభిన్నంగా జరిగింది. ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించేలా ఇది జరిగింది. ఇంటి సభ్యుల ముందు బాక్సులు పెట్టి దాంట్లోంచి ఏదోటి పిక్‌ చేసుకుని దాంట్లో రెడ్‌ ఉంటే రహస్యంగా లేదంటే బ్లాక్‌ ఉంటే బాహాటంగా ఎలిమినేషన్‌కు నామినేట్‌ చేయాల్సి ఉంటుంది.

కెప్టెన్‌ అలీకి ఇమ్యూనిటీ దక్కింది. ఇక శివ జ్యోతి గత వారంలోనే ఎలిమినేషన్‌కు నేరుగా నామినేట్‌ అయ్యింది. ఎలిమినేషన్‌ పక్రియలో కెప్టెన్‌ అలీకి స్పెషల్‌ పవర్‌ ఇచ్చి ఒకరిని నేరుగా నామినేట్‌ చేయాల్సిందిగా సూచించడం జరిగింది. ఆ సమయంలో బాబా భాస్కర్‌ను నామినేట్‌ చేయడం జరిగింది. ఇక మొత్తంగా ఏడుగురు ఈ వారం కూడా నామినేషన్‌లోకి వచ్చారు. అందులో ఎక్కువ ఓట్లతో రాహుల్‌ మరియు హిమజలు ఉన్నారు. ఆ తర్వాత అషు, మహేష్‌ విట్టా, పునర్నవి, శివ జ్యోతి, బాబా భాస్కర్‌. ఈ ఏడుగురిలో ఈ వారం ఒకరు ఇంటికి వెళ్లబోతున్నారు. గత వారం తప్పించుకున్న రాహుల్‌ ఈ వారం వెళ్తాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.