తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడైన కేఏపాల్ మొన్నటి ఎన్నికల్లో మీడియాలో ఎంతటి ఎంటర్‌టైన్ చేశాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఏకంగా సీఎం అవుతానంటూ మాటలు చెప్పిన కేఏపాల్ కనీసం ఒక్కటి రెండు సీట్లు కూడా గెలవలేక పోయాడు. కనీసం ఆయన పోటీ చేసిన వద్ద కూడా గెలువలేదు. అత్యంత దారుణమైన పరాజయంను మూట కట్టుకున్న కేఏపాల్ మళ్లీ తన మత ప్రచారంతో బిజీ అయ్యాడు.
దేశ విదేశాలు తిరుగుతూ శాంతి సందేశం ఇస్తున్న కేఏపాల్ త్వరలో అరెస్ట్ కాబోతున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా కోర్టు కేఏపాల్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేయడం జరిగింది. కేఏపాల్ తన తమ్ముడు డేవిడ్ రాజు హత్య కేసులో నింధితుడిగా ఉన్నాడు. గత కొన్నాళ్లుగా కేసు విచారణకు కేఏపాల్ ఏవో కారణాలు చెబుతూ హాజరు అవ్వడం లేదు. దాంతో కోర్టు దిక్కార కేసు నమోదు చేయడంతో పాటు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అరెస్ట్ వారెంట్ జారీ అవ్వడంతో త్వరలోనే కేఏపాల్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.