ఏపీ సీఎం హోదాలో మొదటి సారి అమెరికాకు జగన్ వెళ్లిన విషయం తెల్సిందే. అమెరికాలో పార్టీ కార్యక్రమాలు, రాష్ట్ర ప్రయోజనాలు ఇంకా పలు విషయాల గురించి చర్చలు జరపడం జరుగుతుంది. తాజాగా అమెరికా డల్లాస్లో భారీ ఎత్తున మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమెరికాలో అడుగడుగున జగన్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అక్కడ స్థానికులు సైతం అవాక్కయ్యేలా జగన్ స్వాగత ర్యాలీ సాగింది.
స్థానిక తెలుగు వారు జగన్పై చూపించిన ఆధరాభిమానులకు అంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. జగన్ నిర్వహించిన మీటింగ్కు కూడా భారీ ఎత్తున జనాలు హాజరు అయ్యారు. ఒక అమెరికన్ పొలిటికల్ సభ మాదిరిగా జగన్ సభ జరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. జగన్ సీఎం అయిన తర్వాత మొదటి సారి అమెరికా వెళ్లడంతో అక్కడి వారు భారీగా ఆహ్వానం పలికారు. పలు కంపెనీల ప్రతినిధులతో జగన్ భేటీ అయ్యి ఏపీలో వ్యాపారంకు ఆహ్వానించారు.