‘రంగస్థలం’కు 9 సైమా అవార్డులు

గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సెన్షేషనల్‌ మూవీ ‘రంగస్థలం’ ఏ స్థాయిలో వసూళ్లు సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిన నాన్‌ బాహుబలి రికార్డులను దక్కించుకున్న రంగస్థలం చిత్రం తాజాగా సైమా అవార్డుల విషయంలో కూడా రికార్డును దక్కించుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 అవార్డులను సైమాలో దక్కించుకుని రికార్డు సృష్టించింది. కన్నడంలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న కేజీఎఫ్‌ కంటే కూడా అధికంగా రంగస్థలం చిత్రం దక్కించుకుంది. కేజీఎఫ్‌కు 8 అవార్డులు దక్కగా, రంగస్థలంకు మాత్రం 9 అవార్డులు దక్కాయి.

రంగస్థలం చిత్రంకు వచ్చిన అవార్డులు ఇవే..

ఉత్తమ నటుడు : రామ్‌ చరణ్‌

ఉత్తమ నటి : సమంత (విమర్శకుల ఛాయిస్‌)

ఉత్తమ దర్శకుడు : సుకుమార్‌

ఉత్తమ సహాయ నటి : అనసూయ

ఉత్తమ సంగీత దర్శకుడు : దేవిశ్రీ ప్రసాద్‌

ఉత్తమ సినిమాటోగ్రఫర్‌ : రత్నవేలు

ఉత్తమ సింగర్‌ : ఎంఎం మనసి

ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌ : రామకృష్ణ