వైరల్‌ వీడియో : జగన్‌ సింప్లిసిటీకి నిదర్శణం

ఏపీ కొత్త సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో తనదైన మార్క్‌ను వేసుకుంటూ వెళ్తున్నాడు. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, కొన్ని ఆనందింపజేసే నిర్ణయాలు తీసుకుంటూ జగన్‌ ముందుకు సాగుతున్నాడు. జగన్‌ సీఎం అయినప్పటి నుండి ఆయన సింప్లిసిటీ గురించి పదే పదే చర్చకు వస్తుంది. గత సీఎం చంద్రబాబు నాయుడు కంటే జగన్‌ చాలా తక్కువ ఖర్చు చేస్తున్నాడని, అధికారులతో కూడా తానో శాసనకర్తను అనే పొగరుతో మాట్లాడకుండా సాఫ్ట్‌గా మాట్లాడుతున్నాడని అంటున్నారు.

ఇప్పుడు జగన్‌ సింప్లిసిటీకి ఇది మరో నిదర్శణం అంటూ జగన్‌ అభిమానులు ఈ వీడియోను వైరల్‌ చేస్తున్నారు. నిన్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రతిభ కనబర్చిన పోలీసులకు పతకాలు బహూకరిస్తున్నాడు. అలాంటి సమయంలో ఒక ఫ్లాగ్‌ కింద పడిపోయింది. ఆ సమయంలో జగన్‌ కిందకు వంగి మరీ ఆ ప్లాగ్‌ను తీయడం జరిగింది. చుట్టు అధికారులు మరియు సెక్యూరిటీ ఉన్నా కూడా జగన్‌ స్వయంగా ఆ పని చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకే ఈ వీడియో వైరల్‌ అయ్యింది. మీరు జగన్‌ సింప్లిసిటీ వైరల్‌ వీడియోపై ఒక లుక్కేయండి.