అద్వానీకి అస్వస్థత, కాస్త సీరియస్‌గానే ఉందట

బీజేపీ సీనియర్‌ నేత, ఇండియన్‌ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన రాజకీయ ఛాణక్యుడు ఎల్‌కే అద్వానీ తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నట్లుగా బీజేపీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. భారత ఉప ప్రధానిగా విధులు నిర్వర్తించడంతో పాటు ప్రధాని అయ్యే అర్హతలు కూడా ఉన్న వ్యక్తి అంటూ కీర్తించబడ్డ అద్వానీ ఎన్నో పర్యాయాలు మంత్రిగా, ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014 ఎన్నికల తర్వాత ఆయన పోటీ చేయలేదు. బీజేపీ అధినాయకత్వం సీనియర్‌లను పక్కన పెట్టడం జరిగింది. ఆ క్రమంలో అద్వానీకి 2019 పార్లమెంటు ఎన్నికల్లో సీటు దక్కలేదు.

అద్వానీకి సీటు ఇవ్వకున్నా కూడా ఆ పార్టీ ఆయన సేవలను వినియోగించుకుంటూనే ఉన్నారు. ఇక ప్రతి ఏడాది ఢిల్లీలోని ఆయన ఇంట్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈసారి అద్వానీ గారి ఆరోగ్యం సరిగా లేని కారణంగా వేడుకలను రద్దు చేస్తున్నట్లుగా అద్వానీ వ్యక్తిగత సిబ్బంది మరియు అధికారులు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలోని ప్రముఖ హాస్పిటల్‌లో అద్వానీ చికిత్స పొందుతున్నారట. ప్రస్తుతం కాస్త సీరియస్‌గానే ఉన్నా త్వరలోనే కోలుకుంటారని డాక్టర్లు చెప్పినట్లుగా బీజేపీ నాయకులు అంటున్నారు.