‘సాహో’ 80 కోట్లు.. సైరా 40 కోట్లు

ప్రస్తుతం రెండు టాలీవుడ్‌ సినిమాల గురించి దేశ వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. అందులో మొదటిది ‘సాహో’ చిత్రం కాగా రెండవది ‘సైరా’. ఈ రెండు చిత్రాలు కూడా తెలుగులో తెరకెక్కిన భారీ చిత్రాలు ఈనెల 30న సాహో ప్రేక్షకుల ముందుకు రాగా ఒక్క నెల గ్యాప్‌లో అక్టోబర్‌ 2న సైరా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది. ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కాయి. బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ను సైతం ఆశ్చర్యపర్చేంతగా ఈ సినిమాకు బడ్జెట్‌లు అవ్వడం జరిగింది. అయితే ఈ రెండు సినిమాల బిజినెస్‌ విషయంలో మాత్రం చాలా వ్యత్యాసం కనిపిస్తుంది.

సాహో చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 550 నుండి 650 కోట్ల వరకు బిజినెస్‌ చేస్తుందని టాక్‌ వినిపిస్తుంది. అదే సైరా చిత్రం మాత్రం 250 కోట్ల వరకు లాక్కువస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇక ముఖ్యంగా బాలీవుడ్‌ విషయానికి వస్తే సాహో చిత్రంను బాలీవుడ్‌లో డిస్ట్రిబ్యూట్‌ చేసేందుకు హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఫిల్మ్‌ మేకర్స్‌ 80 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. సైరా విషయంలో మాత్రం ఆ స్థాయి బిజినెస్‌ జరగలేదు. 50 కోట్లకు ఈ చిత్రంను అమ్మేందుకు చరణ్‌ చాలా ప్రయత్నించాడు. కాని 40 లోపు మాత్రమే ఈ సినిమా బిజినెస్‌ చేసినట్లుగా తెలుస్తోంది. సైరా హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ విషయంలో చాలా చర్చలు జరిగాయి. అమితాబచ్చన్‌ వంటి బాలీవుడ్‌ మెగాస్టార్‌ నటించడంతో ఆ పాటి జరిగిందనే వారు కూడా ఉన్నారు. మొత్తానికి సాహో మరియు సైరాల మద్య వ్యత్యాసం మాత్రం చాలా కనిపిస్తుంది. మరి విడుదల తర్వాత కూడా ఇది అలాగే కొనసాగేనా లేదా చూడాలి.