ఫ్లాప్‌ల హ్యాట్రిక్‌ కొట్టేనా? లేదంటే సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కుతారా?

మాస్‌ మహారాజా రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమా ఇంకా షూటింగ్‌ దశలో ఉండగానే మరో వైపు ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్ర దర్శకుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ అనే చిత్రాన్ని చేసేందుకు ముందుకు వచ్చాడు. రవితేజ ఈ చిత్రంలో చాలా విభిన్నంగా కనిపించబోతున్నట్లుగా అజయ్‌ భూపతి సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కబోతుంది. ప్రస్తుతం కాస్టింగ్‌ పనిలో దర్శకుడు ఉన్నాయి. ఈ చిత్రంలో రవితేజకు జోడీగా రాశిఖన్నాను ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది.

గతంలో రవితేజ రెండు సార్లు రాశిఖన్నాతో నటించాడు. బెంగాల్‌ టైగర్‌ మరియు టచ్‌ చేసి చూడు చిత్రాల్లో రవితేజ మరియు రాశిఖన్నాలు కలిసి రొమాన్స్‌ చేశారు. కాని రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద దారుణమైన పరాజయం పాలయ్యాయి. ఆ ఫలితాలను పట్టించుకోకుండా ముచ్చటగా మూడవ సారి వీరిద్దరు కలవబోతున్నారు. మరి మహాసముద్రం ఈ జంటకు హ్యాట్రిక్‌ ఫ్లాప్‌ను ఇవ్వబోతుందా లేదంటే మొదటి సక్సెస్‌ను కట్టబెట్టబోతుందా చూడాలి. సహజంగా హీరోలు ఇలాంటి సెంటిమెంట్లు ఎక్కువగా నమ్ముతారు. ఒక హీరోయిన్‌తో రెండు సినిమాలు ఫ్లాప్‌ అయితే మరోసారి ఆమెను ట్రై చేయరు. కాని రవితేజ మాత్రం అలాంటి పట్టింపు లేకుండా రాశిఖన్నాతో చేయబోతున్నాడు.