వార్ రిలీజ్ డేట్ తో మెగా అభిమానుల్లో టెన్షన్..

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణీ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘వార్’. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమా ఫై అంచనాలు పెంచగా..తాజాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 02 న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా తెలిపారు. ఈ ప్రకటన రావడం తో మెగా అభిమానుల్లో టెన్షన్ మొదలు అయ్యింది. అదేంటి అనుకుంటున్నారా..చిరంజీవి నటించిన సైరా చిత్రం కూడా అక్టోబర్ 02 నే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

చిరంజీవి – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం సైరా. ఉయ్యాలా వాడ నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 02 న తెలుగు, తమిళ్ , హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతుంది. తెలుగు లో ఈ చిత్రానికి ఏ పోటీ సినిమా లేనప్పటికీ..హిందీలో మాత్రం గట్టి పోటీనే ఉండబోతుంది.

సైరా చిత్రాన్ని బాలీవుడ్ లో భారీగా విడుదల చేయాలనీ చరణ్ ప్లాన్. పైగా సినిమాలో బిగ్ బి అమితాబ్ కూడా ఉండడం తో సినిమాకు మరో ఆకర్షణ అయ్యింది. సైరా రిలీజ్ డేట్ నాడే హృతిక్ రోషన్ వార్ సినిమా రాబోతుంది. దీంతో ఈ సినిమా..సైరా కు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి.