కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిన విషయం తెల్సిందే. దాంతో పాటు జమ్ముకశ్మీర్ నుండి లడఖ్‌ను విడదీసి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఒక వైపు అల్లర్లు మరో వైపు విజయోత్సవ సంతోష వేడుకలు జరుగుతున్నాయి. కశ్మీర్ గురించి ఇండియన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాక్ మండి పడుతుంది. ఇది మన అంతర్ఘత వ్యవహారం అయినా కూడా పాక్‌కు ఈ పరిణామం మింగుడు పడటం లేదు. అందుకే చైనా మరియు అమెరికాలతో బెదిరింపులకు ప్రయత్నించింది. కాని అది సాధ్యం కాలేదు. దాంతో భారత్‌తో వాణిజ్య సంబంధాలను తెంపుకుంది.
భారత్‌తో వాణిజ్య సంబంధాలు తెంపుకుంటే నష్టం వాటిల్లేది పాకిస్తాన్‌కే. ఆ విషయం గతంలో పలు సార్లు అనుభవంలోకి వారికే వచ్చింది. అయినా కూడా మరోసారి వాణిజ్య సంబంధాలపై నిషేదం విధించడం జరిగింది. ఈ నిషేదం కారణంగా ఇండియా నుండి పాక్‌కు వెళ్లే టమాటాలు ఇంకా నిత్యావసర వస్తువులు ఆగిపోయాయి. దాంతో పాకిస్తాన్‌లో పలు నిత్యావసర వస్తువులకు కటకట ఏర్పడింది. ముఖ్యంగా టమాటలు ఏకంగా రూ.300కు చేరింది. ఇంకా పలు వస్తువుల ధరలకు రెక్కలు రావడంతో పాకిస్తాన్‌లోని సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి చెరువు మీద అలిగిన కొంగ పరిస్థితి అయ్యిందంటూ జోకులు పేలుతున్నాయి.