కన్నడ సినిమాల పరిధి చాలా తక్కువ. కేజీఎఫ్‌కు ముందు వరకు కన్నడ సినిమా పాతిక కోట్లు వసూళ్లు సాధిస్తే బ్లాక్ బస్టర్‌గా అనుకునేవారు. అక్కడ సూపర్ స్టార్లు మెగాస్టార్లు కూడా పాతిక ముప్పై కోట్లను రాబట్టేందుకు కిందా మీదా పడాల్సిన పరిస్థితి. అలాంటిది కేజీఎఫ్ చిత్రం వందల కోట్ల వసూళ్లను రాబట్టి కన్నడ సినీ పరిశ్రమ స్థాయిని పెంచడం జరిగింది. కేజీఎఫ్ ఈ చిత్రం తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘కురుక్షేత్రం. 3డి టెక్నాలజీతో తెరకెక్కిన ఈ మహాభారత చిత్రంకు కన్నడ ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
కన్నడంలో తెరకెక్కిన ఈ 3డి చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో విడుదలైంది. సినిమాపై ఉన్న ఆసక్తి నేపథ్యంలో మొదటి రోజు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. కేజీఎఫ్ చిత్రం మొదటి రోజు 12.5 కోట్లను రాబట్టడం జరిగింది. కన్నడ సినిమాల్లో అదే రికార్డు. కాని ఇప్పుడు కురుక్షేత్రం ఏకంగా 15 కోట్ల వరకు మొదటి రోజు రాబట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు కేజీఎఫ్ లాంగ్ రన్లో రాబట్టిన స్థాయిలో కురుక్షేత్రం రాబట్టగలదా అనే చర్చ మొదలైంది. మొదటి రోజు కలెక్షన్స్ లాంగ్ రన్ కలెక్షన్స్‌గా మారి భారీ వసూళ్లను సాధిస్తుందా అనేది చూడాలి.