విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఇటీవలే ‘దొరసాని’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దాంతో పాటు ఆనంద్ దేవరకొండ నటన గురించి కూడా విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయినా కూడా సినిమాల్లో తేల్చుకునేందుకు వచ్చానంటున్న ఆనంద్ దేవరకొండ మరో సినిమాకు సిద్దం అయ్యాడు. అయితే ఈసారి ఆనంద్ దేవరకొండ మరోకొత్త దర్శకుడితో తన అదృష్టంను పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
పలు సూపర్ హిట్ చిత్రాలను అందించిన భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రంను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఒక విభిన్నమైన లవ్ స్టోరీతో వినోద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. పలు సినిమాలకు స్క్రిప్ట్ రచయితగా పని చేసిన వినోద్ ఈ చిత్రంతో దర్శకుడిగా తానేంటో నిరూపించుకోబోతున్నాడు. విజయ్ దేవరకొండ కథ విని ఓకే చెప్పడంతో సినిమా త్వరలోనే పట్టాలెక్కేందుకు సిద్దం అవుతుంది. తమ్ముడితో సినిమా తీయాల్సిందిగా ఆనంద్ ప్రసాద్‌ను విజయ్ దేవరకొండ రిక్వెస్ట్ చేశాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి.