కమెడియన్ పృథ్వీ ఎస్వీబీసీ చైర్మన్ పదవిని దక్కించుకున్నా కూడా ఇంకా జోకులు వేస్తూ మాట్లాడుతున్నాడని, ఒక గౌరవ ప్రధమైన హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాట్లాడటం లేదు అంటూ గత కొన్ని రోజులుగా ఆయన విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఏపీ సీఎం జగన్‌ను సినిమా పరిశ్రమకు చెందిన వారు ఎవరు కూడా కలిసి అభినందనలు తెలియజేయలేదు అనేది పృథ్వీ ఆరోపణలు. అదే చంద్రబాబు నాయుడు మరోసారి సీఎం అయితే ఇండస్ట్రీ పెద్దలు పలువురు క్యూ కట్టి మరీ చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేసే వారు. జగన్ సీఎం అవ్వడం ఇండస్ట్రీ వారికి ఇష్టం లేనట్లుగా ఉందని అన్నాడు.
ఈ వ్యాఖ్యలపై రాజేంద్ర ప్రసాద్ సీరియస్‌గా స్పందించాడు. సీఎం జగన్‌ను ఇండస్ట్రీ వారు కలవాల్సిన అవసరం ఏంటీ. వీలు చూసుకుని కలుస్తారేమో. వెంటనే కలిసేందుకు ఇండస్ట్రీ వారు ఏమీ పారిశ్రామిక వేత్తలు కాదు కదా అంటూ రాజేంద్ర ప్రసాద్ అన్నాడు. ఇండస్ట్రీ వారికి జగన్ సీఎం అవ్వడం ఇష్టం లేదు అంటూ పృథ్వీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టాడు. ఆ విషయాన్ని నువ్వు ఎలా నిర్ణయిస్తావంటూ ప్రశ్నించాడు. నేడు తిరుమల వెళ్లిన రాజేంద్ర ప్రసాద్ రేపు లేదా ఎల్లుండి జగన్‌ను కలిసే అవకాశం ఉంది. జగన్‌తో సన్నిహిత సంబంధాలున్న రాజేంద్ర ప్రసాద్ ఆయన్ను కలిసి అభినందనలు తెలియజేయబోతున్నాడు.