కియా కంపెనీ మొదటి కారును ఆవిష్కరించిన కార్యక్రమంలో వైకాపాకు చెందిన పలువురు పార్టీ ప్రతినిధులు మరియు ప్రజా ప్రతినిధులు ఇంకా ప్రభుత్వ ముఖ్యలు హాజరు అయ్యారు. ఇదే కార్యక్రమంలో ప్రొటో కాల్ ప్రకారం ఎంపీ గోరెంట్ల మాధవ్ కూడా హాజరు అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ గోరెంట్ల మాధవ్ అక్కడ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైకాపా పరువు పోయేలా చేసిందని ఆ పార్టీ సొంత నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కియా కంపెనీ ప్రతినిధులు ఇంకా కూడా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్నారని, స్థానికులకు 75 శాతం ఉద్యోగాలను ఇవ్వాల్సిందిగా అక్కడే హెచ్చరించినట్లుగా మాధవ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ సంఘటనలో గోరెంట్ల మాధవ్ వ్యవహరించిన తీరు ఏమాత్రం సరిగా లేదు అంటూ ఆ పార్టీకి చెందిన నాయకులే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మీడియా ముందు ప్రభుత్వం మరియు పార్టీ పరువు పోయేలా మాట్లాడటంతో పాటు ప్రతిష్టాత్మక కంపెనీ అయినా కియాను బెదిరించినట్లయ్యిందని జగన్ కూడా భావిస్తున్నాడట. అందుకే ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకోవడం లేదంటే సీరియస్‌గా మందలించడం చేస్తున్నాడట.