బాలీవుడ్లో కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ‘క్వీన్’ చిత్రంను సౌత్‌లో నాలుగు భాషల్లో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. సౌత్‌లో ఈ చిత్రం ప్రారంభం అయ్యి చాలా ఏళ్లు అయ్యింది. కాని ఇప్పటి వరకు సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. నాలుగు భాషల్లో కూడా నలుగురు హీరోయిన్స్ నలుగురు దర్శకులు ఈ రీమేక్ కోసం పని చేశారు. ఎట్టకేలకు సినిమ పూర్తి అయ్యింది. సెన్సార్ ముందుకు వచ్చింది. తెలుగు, కన్నడం, మలయాళంలో ఎలాంటి సమస్య లేదు. కాని తమిళంలో ఈ చిత్రం సెన్సార్ పెద్ద కష్టంను తెచ్చి పెట్టింది.
తమిళంలో ఈ రీమేక్‌కు పారిస్ పారిస్ అనే టైటిల్‌ను పెట్టడం జరిగింది. కాజల్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం సెన్సార్ బోర్డు ముందుకు వెళ్లిన సమయంలో ఏకంగా 25 కట్స్ చెప్పారట. సినిమాలో బూతులు మరియు హాట్ సీన్స్ ఉన్న కారణంగా ఇన్ని కట్చ్ చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. ఒక్క సినిమాకు మరీ ఇన్ని కట్స్ ఇవ్వడం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. కాజల్ తమిళ సెన్సార్ బోర్డు తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. క్వీన్‌ను ఉన్నది ఉన్నట్లుగా తీసినా కూడా ఎందుకు ఈ పరిస్థితి అంటూ ఆమె ప్రశ్నించింది. మరి పారిస్ పారిస్ సెన్సార్ కష్టాలను ఎలా ఎదుర్కొని బయటకు వస్తుందో చూడాలి. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నారు.