రకుల్‌, జాన్సీ ముద్దు సీన్‌ కథేంటీ?

నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మన్మధుడు 2’ చిత్రంకు మిశ్రమ స్పందన వస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో సినిమా ఆకట్టుకుందని కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం సినిమా చాలా మూసగా ఉందని కొందరు అంటున్నారు. ఇక రివ్యూలు కూడ సో సోగానే వచ్చాయి. సినిమాకు ఆకర్షణగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె స్కిన్‌ షో తో పాటు ఆమె నటన సినిమాకు ప్లస్‌ అయ్యిందని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో జాన్సీతో రకుల్‌ ముద్దు సీన్‌ కూడా ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.

సినిమాలోని ఒక సన్నివేశం సందర్బంగా సడన్‌గా జాన్సీకి రకుల్‌ ముద్దు పెడుతుంది. అది కూడా పెదవులపై అవ్వడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. సౌత్‌ సినిమాలో లేడీస్‌ ముద్దులు పెట్టుకోవడం అది కూడా లిప్‌ టు లిప్‌ కిస్‌లు పెట్టుకోవడం అస్సలు కనిపించవు. మొదటి సారి జాన్సీ మరియు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లు లిప్‌లాప్‌ పెట్టుకోవడం చర్చనీయాంశం అవుతుంది. సినిమా విషయం పక్కన పెడితే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ ముద్దు సీన్‌ వైరల్‌ అవుతుంది.